అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. అలస్కాలోని పాయింట్ మాకెంజీలో 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేకు సుమారు 2,794 మంది 'ఫీల్డ్ రిపోర్ట్' దాఖలు చేశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే 2018లో అంకరెజ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే