సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింపుల్ లైఫ్‌ను లీడ్ చేస్తారో అందరికీ తెలిసిందే. నిత్యం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ స్టార్ హీరో.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో విలువైన సమయాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు తాజాగా గ్రాండ్‌ఫాదర్ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేశారు. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడు వేద్‌ని స్వయంగా ఆయనే తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రజినీ కుమార్తె సౌందర్య ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.