భువనేశ్వర్‌లోని నాయపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోను కూడా చిత్రీకరించారు. అంతేకాక, వీడియోను వైరల్ చేస్తానని బాధితురాలి తల్లిని బెదిరించి డబ్బులు అడిగారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలి స్నేహితురాలు బాలికను నలుగురు వ్యక్తుల వద్దకు పంపింది. వారంతా బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.