యూపీలోని భదోహిలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. వరుడు మద్యం, గంజాయి తాగుతున్నాడని వధువు పెళ్లి రద్దు చేసింది. అంతేకాకుండా పెళ్లి కోసం ఖర్చు చేసిన రూ.8 లక్షలు తిరిగివ్వాలని వధువు కుటుంబం డిమాండ్ చేసింది. అంతేకాకుండా వరుడు తహశీల్దార్ గౌతమ్, అతని తండ్రి జై ప్రకాష్, తాత మేవలాల్‌ను వధువు కుటుంబికులు బందీలుగా చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను రాజీ చేసుకోవాలని సూచించారు.