రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని దుయ్యబట్టారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 2 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని హరీశ్‌రావు తెలిపారు.