తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్
నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ
య్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతీ పైకి ఎక్కి షర్ట్ లోపల నుంచి ఛాతీ వరకు వెళ్లిపోయింది. ఇంతలో రాజయ్య ఓ చేత్తో మైక్‌ను పట్టుకొని.. మరో చేత్తో తొండను షర్టుతో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న బీఆర్ఎస్ నేత ఒకరు కండువాతో తొండను బంధించి పక్కన విసిరేశారు.