పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిడమర్రు మండలానికి చెందిన బొంగా సురేష్, జ్యోత్స్న దంపతుల నెల బిడ్డకు గుండెకు రంధ్రం ఉండి అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పడంతో, ఆ తల్లిదండ్రులు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు భరించి, తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో బిడ్డకు చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు.