ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు డబ్బుతో ముడిపడిన సమస్య ఏదైనా పెద్దదే!. దీర్ఘకాలిక రోగాలు కావొచ్చు, ఊహించకుండా వచ్చి పడే జబ్బులు కావొచ్చు.. ఇలాంటి వారికోసం ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నప్పటికీ.. కొన్ని జబ్బులను ఈ పథకంలో చేర్చలేదు. ప్రాణం ముఖ్యం కాబట్టి అందినకాడ అప్పు తెచ్చి వైద్యం చేయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఆఖరి ఆశాదీపం ఏదైనా ఉందంటే.. అది సీఎం సహాయ నిధి. అయితే పేదలకు అందాల్సిన సాయాన్ని కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో పొందుతున్నారు.