సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ గోవాలోని పనాజీ బీచ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. రష్యన్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి బీచ్‌కు వచ్చాడు. అయితే వృద్ధుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. గమనించిన మత్స్యకారుడు వెంటనే స్పీడ్ బోటులో సముద్రంలోకి వెళ్లి, చివరకు అతన్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. మత్స్యకారుడికి వృద్ధుడు కృతజ్ఞతలు తెలియజేశాడు.