రిపేర్ చేస్తుండగా పేలిన ఫోన్.. షాకింగ్ వీడియో

61చూసినవారు
కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కాట్‌లో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. చలీల్ అనే వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఓ వ్యక్తి ఫోన్‌ను రిపేర్ కోసం తీసుకొచ్చాడు. ఆ ఫోన్‌ను షాపులోని ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగగా, ఉద్యోగికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్