రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్ మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.