దొంగను చితక్కొట్టిన మహిళ.. వీడియో వైరల్

69చూసినవారు
మొబైల్ ఫోన్ చోరీకి యత్నించిన యువకుడిని ఓ మహిళ చితక్కొట్టింది. ఈ ఘటన మీరట్‌లోని సదర్ బజార్ పీఎస్ పరిధిలోని బేగంపుల్ సమీపంలో చోటు చేసుకుంది. సదరు మహిళ మొబైల్ ఫోన్ ను లాక్కొని పారిపోతుండగా దొంగను స్థానికులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైనా మహిళా నిందితుడు అర్మాన్‌ను చితకబాదింది. జుట్టు పట్టుకొని కసితీరా కొట్టింది. స్థానికులు సైతం ఆ దొంగకు దేహశుద్ది చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్