ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని చైన్ స్వీట్స్ మరియు రెస్టారెంట్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి వాష్‌రూమ్‌లో ఓ మహిళ రహస్య కెమెరాను కనిపెట్టింది. వాష్‌రూమ్‌లోని సీలింగ్‌లో రెస్టారెంట్ ఉద్యోగి మహిళలను సీక్రెట్ గా చిత్రీకరించడానికి మొబైల్ కెమెరా పెట్టాడు. దాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయండతో గురువారం రాత్రి అతడ్ని అరెస్టు చేశారు. ఈ నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లు తెలుస్తోంది.