ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎడారుల్లో ఒకటి సౌదీ అరేబియాలోని 'రబ్ అల్ ఖలీ'. ఈ ఎడారి పేరులో ఉన్న 'ఖలీ' అనే పదం శూన్యాన్ని సూచిస్తుంది. అంటే చాలా మైళ్ల దూరం వరకు ఈ ఎడారిలో ఏమీ కనిపించదు. 6,50,000 చ.కి పైగా విస్తరించి ఉన్న ఈ ఎడారి, 50 మి.మీ కంటే తక్కువ వార్షిక వర్షపాతంతో కఠిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఎమ్టీ క్వార్టర్ గా కూడా పిలిచే ఈ ప్రాంతంలో ఇటీవల కరీంనగర్ వాసి తప్పిపోయి నీరు లేక డీహైడ్రేషన్, అలసటకు గురై మరణించిన విషయం తెలిసిందే.