యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి హైదరాబాద్ వచ్చింది. ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఒక ప్రైవేటు పార్టీలో కలిసిన హర్షసాయి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని సినీ నటి తెలిపింది. పెళ్లి చేసుకునేందుకంటూ తన నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొంది.