భూప్రకంపనలు సంభవించినప్పుడు మొదట ప్రశాంతంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు భరోసా ఇవ్వాలి. భూకంపం సంభవించినప్పుడు, ఇంట్లో ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా వెళ్లాలి. డెస్క్, టేబుల్, బెడ్ కింద దాక్కోవాలి. అలా దాక్కుంటే ఇంట్లోని సామాన్లు వారిపై పడకుండా తప్పించుకోవచ్చు. భూకంపం ఆగేవరకు ఇళ్లలోకి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా భూకంపం సమయంలో కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దు.