వరి అధిక దిగుబడికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి

77చూసినవారు
వరి అధిక దిగుబడికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం వరి సాగుకు అనుకూల సమయం. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో నారిమళ్లను విత్తుకుంటుంటారు. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడికి అవకాశం ఉంటుంది. రాత్రి సమయాల్లో నారుమళ్లను పాలిథీన్ షీట్లతో కప్పి ఉంచి ఉదయం తీసివేయాలి. ప్రతి రోజు ఉదయం కొత్త నీరు పెట్టడం మంచిది. అలాగే యూరియాను పైపాటుగా నారుపోసిన 10-15 రోజుల్లో చల్లుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్