బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పాడు. 2000 నుంచి SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధికసార్లు 100కుపైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును రాహుల్ సమం చేశాడు. సెహ్వాగ్ మూడుసార్లు శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. తాజాగా రాహుల్ కూడా ఈ ఫీట్ సాధించాడు.