చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ కొట్టారు.. తీరా చూస్తే షాక్ (వీడియో)

73చూసినవారు
తాగి నీటిలో పడుకున్న ఓ వ్యక్తిని చూసి చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. తీరా పోలీసులు వచ్చి చూసి షాకయ్యారు. ఓ వ్యక్తి ఈరోజు ఉదయం 7-12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. దీంతో స్థానికులు కేయూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికిలాగగా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో జరిగింది. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్