అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో అలేఖ్య అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలో అలేఖ్య చెల్లి రమ్య ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. 'మా అక్క అలేఖ్య చిట్టి తాను చేసిన తప్పుకు పబ్లిక్‌గా అందరికీ క్షమాపణలు చెప్పింది. దాన్ని కూడా మీమర్స్, యూట్యూబర్స్ నెగెటివ్ గా స్ప్రెడ్ చేశారు. ఒక ఆడపిల్లను ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు. మా అక్కకి ఏదైనా జరిగితే మీరు బాధ్యత వాహిస్తారా' అంటూ ప్రశ్నించింది.