యూపీలోని కొత్వాలి ప్రాంతంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోస్తీ నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను రామ్‌కుమార్, వికాస్‌గా పోలీసులు గుర్తించారు.