ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునేందుకు ఇంకా 10 రోజులే గడువు ఉంది. myAadhaar పోర్టల్‌లో ఉచితంగా ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. వీటికోసం డిసెంబర్ 14, 2024 వరకు UIDAI గడువు ఇచ్చింది. అంటే ఇంకా 10 రోజులే ఛాన్స్ ఉంది. ఈ తేదీ తర్వాత ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటే నిర్థారించిన ఫీజు చెల్లించాల్సిందే.