మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' అమలు చేస్తోంది. SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తోంది. 10 ఏళ్లలో ఆ లోన్ మొత్తం చెల్లించాలి. ఆ లోన్ సాయంతో మహిళలు బ్యూటీపార్లర్, రెస్టారెంట్లు, సైబర్ కేఫ్, టైలరింగ్ తదితర వ్యాపారాలు ప్రారంభించొచ్చు. దీని కోసం స్థానిక బ్యాంకులను సంప్రదించాలి.