సికింద్రాబాద్‌ -విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు

63చూసినవారు
సికింద్రాబాద్‌ -విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్‌ నేపథ్యంలో డిసెంబర్ 6 నుంచి 30 వరకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. అలాగే సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, ఒడిశాలోని బ్రహ్మపురకు కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్