మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పనితీరు బాగా లేదనే కారణంతో గతేడాది ఎంపీ హైకోర్టు ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగించింది. తనకు గర్భస్రావం కావడంతో విధులకు హాజరుకాలేదని చెప్పినప్పటికీ ఓ మహిళ జడ్జిని తొలగించడంతో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పురుషులకు నెలసరి వస్తే వారి పరిస్థితి తెలిసేది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే జడ్జిల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.