ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. "తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ…మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.