ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని ప్రధాని తెలిపారు.