8:40 - సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు. రుయా, స్విమ్స్‌కు గాయపడిన భక్తుల తరలింపు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుబ్బరాయుడు సిబ్బందితో అక్కడి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
9:27 - TTD ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
9:30 - పార్కులోని భక్తులందరినీ క్యూ పద్ధతిలో కౌంటర్‌లోని క్యూలైన్లలోకి వదిలారు.