వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.