భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చింది. నిజాం నవాబు నిరంకుశ పాలన, రజాకర్ల ఆకృత్యాలకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని ఎదురించి తెలంగాణ సాయుధ పోరాటం సాగింది. ఈ పోరాటంలో భూస్వాములు, పెత్తందారుల నుంచి భూమిని తీసుకొని పేదలకు పంచారు కమ్యూనిస్టులు. అయితే 1948 సెప్టెంబరు 17న నిజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోయారు. ఆ రోజునే తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తున్నారు.