ఇంగ్లాండ్‌తో టీ20ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడి సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా వన్డేల్లో ఆ జట్టుతో సున్నా చుట్టించేయాలని చూస్తోంది. రోహిత్‌సేన క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఇవాళ మూడో వన్డేలో బరిలోకి దిగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇది నామమాత్రమైన మ్యాచే అయినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఆడబోతున్న చివరివన్డే కావడంతో ఇరు జట్లూ దీన్ని తేలిగ్గా తీసుకోవట్లేదు.