నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం

589చూసినవారు
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ఏప్రియల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కలిపించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మలేరియా ప్రపంచంలోని ప్రాణాంతకమైన పరాన్నజీవుల వ్యాధులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్