ఈరోజు రాశిఫలాలు (05-06-2024)

56చూసినవారు
ఈరోజు రాశిఫలాలు (05-06-2024)
మేషం
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృషభం
మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం
బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

సింహం
చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమునకొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య
కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

తుల
ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం
చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

ధనస్సు
దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.

మకరం
వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం
ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

మీనం
ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

ట్యాగ్స్ :