’కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు‘ అని నటి, వైద్యురాలు కాదంబరి జెత్వానీ అన్నారు. ’వాళ్ల వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. సరిగా నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఓ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా వేధించారు’’ అని నటి వాపోయింది.