హీరోయిన్ పూజ హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె బామ్మ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పూజ హెగ్డే భావోద్వేగభరితంగా ట్వీట్ చేసింది. బామ్మను కోల్పోయామని, ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా, ఎలాంటి బాధలు లేకుండా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఉండాలనే విషయాన్ని తన బామ్మ తమకు నేర్పించిందని పూజ హెగ్డే పేర్కొంది. ధైర్యంగా ఉండడాన్ని, ఇగోను పక్కనబెట్టి కావాల్సిన వారితో కలిసిమెలసి ఉండడాన్ని తన బామ్మ నేర్పించిందని పూజాహెగ్డే తెలిపింది.
తన భామ ఎప్పుడు తనతోనే ఉంటుందని, లవ్ యూ ఆజీ అని పేర్కొంది. తాను సినిమా షూటింగుల్లో ఉన్న సమయంలో తనకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని పదేపదే అడిగేదని తెలిపింది. ఇప్పుడు తాను ఆమె ఫోన్ కాల్స్ ను మిస్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నట్లు తెలుపుతూ తన బామ్మతో గతంలో దిగిన ఫొటోను పూజా హెగ్డే పోస్ట్ చేసింది.