తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్ గ్రామంలో అన్నాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇందూప్రియాల్‌లో విషాదం నెలకొంది. కళ్యాణి (20) చెరువులో పడి ఆత్మహత్య చేసుకోగా.. రాము(23) గడ్డిమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.