పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర
ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని
మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ. 2.50 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని కేంద్రం తెలిపింది.