తెలంగాణ రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన భూ భారతి -2025 చట్టాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని, ప్రజామోదం పొందిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ట్రెసా ఆధ్వర్యంలో రూపొందించిన రెవెన్యూ డైరీ -2025ని మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. సంక్రాంతి లోపు తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.