దేశంలో రాజకీయంగా అత్యంత శక్తివంతమైన నేతగా మోదీ నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్,హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలిచినట్లు ఇండియా టుడే తెలిపింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. ‘ ప్రధానిగా వరుసగా మూడో సారి ఎన్నికైన మోదీ, దేశ ఎకానమీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు’ అని విశ్లేషించింది.