ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో కీలక భూమిక పోషిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలో మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించారు. వీరు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు. తదుపరి కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి మావోయిస్టుల వ్యతిరేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ రేంజిలోని కాంకేర్ జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. ఇదివరకే 90 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.