యూపీలోని అమ్రోహ జిల్లాలో ఓ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు కూలినప్పుడు దాని కింద నలుగురు చిక్కుకోగా వారిని క్షేమంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు వద్ద దుకాణం నిర్వహిస్తున్న ఓ దుకాణదారుడు ఇటీవల చెట్టు వేరును తవ్వడంతో చెట్టు కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. చెట్టు కూలిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో వైరల్‌గా మారింది.