ట్రయాంగిల్ లవ్.. ప్రియుడితో కలిసి SIని కారుతో ఢీకొట్టి చంపిన మహిళా కానిస్టేబుల్

61చూసినవారు
ట్రయాంగిల్ లవ్.. ప్రియుడితో కలిసి SIని కారుతో ఢీకొట్టి చంపిన మహిళా కానిస్టేబుల్
మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి SIను చంపింది. పచోర్ పోలీస్ స్టేషన్‌లో పల్లవి సోలంకి కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమెకు ప్రియుడు కరణ్ ఠాకూర్‌‌తో గొడవ జరిగింది. తర్వాత ఆమెకు SI దీపాంకర్ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకే ప్రియుడు కరణ్ తన వద్దకు రావడంతో దీపాంకర్‌ను వదిలించుకోవాలని పల్లవి భావించింది. అతడిని ఫోన్ చేసి పిలిచి, ప్రియుడి సాయంతో కారుతో ఢీకొట్టి చంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్