TS: పెట్రోల్ బంక్ వధ్ద తృటిలో తప్పిన ప్రమాదం

21822చూసినవారు
భువనగిరి నుంచి నల్లగొండ వెళ్లే రహదారిపైన ఉన్న నయారా పెట్రోల్ బంకు వద్ద అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ లో డీజిల్ నింపుకోవడానికి వెళుతున్న లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది.