తులసి మొక్క గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. దాని గింజలు కూడా అంతే మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తులసి గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తులసి గింజలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.