ఏపీలో రెండు బస్సులు ఢీ (వీడియో)

69చూసినవారు
ఏపీలోని ముమ్మిడివరం నియోజకవర్గం అన్నంపల్లి టోల్‌గేట్ సమీపం 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి అమలాపురం వెళుతున్న అమలాపురం డిపోకు చెందిన ఆల్ట్రా బస్, హైదరాబాద్ నుంచి యానం వెళుతున్న కోమలి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి, ఇరువురు డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్