గుజరాత్‌లోని వడోదరలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అటవీ శాఖ అధికారులు, వాలంటీర్లు వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న మొసళ్లను రక్షించే పనిలో పడ్డారు. ఈ మేరకు వడోదరలో అటవీ శాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ స్కూటీపై మొసలిని తీసుకెళ్తున్న ఓ వీడియో వైరల్ గా మారింది. విశ్వామిత్ర నది నుండి కొట్టుకొచ్చిన ఆ మొసలిని రక్షించి వారి కార్యాలయానికి తీసుకువెళుతున్నట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఇటీవల గుజరాత్ లో వరదల కారణంగా డజన్ల కొద్దీ మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించాయి.