రెండు ట్రక్కులు ఢీ.. పూర్తిగా దగ్ధమైన వాహనాలు(వీడియో)

85చూసినవారు
హర్యానాలోని ఝజ్జర్‌లో రెండు ట్రక్కులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ వాహనాలకు మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని బీరి-ఝజ్జర్ ఎస్‌హెచ్‌వో అమిత్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరగగానే డ్రైవర్లు వాహనం నుంచి దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదం కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్