సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానమిచ్చారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.