తిరుమలలో మార్చి 30న ఉగాది ఆస్థానం.. పలు సేవలు రద్దు: TTD

85చూసినవారు
తిరుమలలో మార్చి 30న ఉగాది ఆస్థానం.. పలు సేవలు రద్దు: TTD
తిరుమల శ్రీవారి సన్నిధిలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో మార్చి 25, 30న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. మార్చి 25న అష్టాదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. మార్చి 30న నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్