ఉరేసుకుని రీల్స్... చివరకు ప్రాణం తీసింది

14860చూసినవారు
ఉరేసుకుని రీల్స్... చివరకు ప్రాణం తీసింది
రీల్స్‌ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌(23)కి మొబైల్‌తో రీల్స్‌ చేసే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో తీయాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ని అమర్చి దూలానికి ఉరి వేసుకోబోయాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకొని మృతి చెందాడు. కాగా తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్‌ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్